రిఫా సెంట్రల్ మార్కెట్ తాత్కలికంగా తరలింపు
- October 10, 2022
బహ్రెయిన్: రిఫా సెంట్రల్ మార్కెట్ పునరుద్ధరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభావితమైన వ్యాపారులను తాత్కాలిక మార్కెట్ స్థలానికి అధికారులు తరలించారు. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తాత్కాలిక మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఎయిర్ కండిషనింగ్, భద్రతా సౌకర్యాలు కల్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 40 కూరగాయల దుకాణాలు, 12 చేపల దుకాణాలు, ఏడు మాంసం దుకాణాలు, రెండు చికెన్ స్టాల్స్ ఉన్న ప్రస్తుత రిఫా మార్కెట్ ను 10 నెలల్లో పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిఫా సెంట్రల్ మార్కెట్ పునరుద్ధరణ కోసం రెండు బిడ్లను మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్వీకరించింది. సరబ్ కాంట్రాక్టింగ్ కో ప్రాజెక్ట్ కోసం BHD 749,050.000, ఇంటర్ లాక్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ BHD 921,516.540 కోట్ చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







