60 రోజుల టూరిస్ట్ వీసాల జారీని పునఃప్రారంభించిన యూఏఈ
- October 10, 2022
యూఏఈ: 60 రోజుల విజిట్ వీసాల జారీని యూఏఈ పున:ప్రారంభించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 3 నుండి అమల్లోకి వచ్చిన అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్ అని పిలువబడే విస్తృత సంస్కరణల్లో ఇది ఒక భాగం అని పేర్కొంది. యూఏఈ అతిపెద్ద రెసిడెన్సీ, ఎంట్రీ పర్మిట్ సంస్కరణల్లో భాగంగా అడ్వాన్స్డ్ వీసా సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్లో యూఏఈ కేబినెట్ ప్రకటించిన వివరాల ప్రకారం.. అన్ని ప్రవేశ వీసాలు వాటి జారీ తేదీ నుండి 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. కొత్త ప్రవేశ అనుమతులలో ఉద్యోగ అన్వేషణ ప్రవేశ వీసా, వ్యాపారం కోసం వచ్చేవారు, ఐదు సంవత్సరాల బహుళ-ప్రవేశ పర్యాటక వీసా, బంధువులు లేదా స్నేహితులను సందర్శించడానికి, తాత్కాలిక పని కోసం, చదువులు/శిక్షణ కోసం వచ్చే వారికి వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 60 రోజుల విజిట్ వీసా జారీ ప్రారంభమైందని, ఈ వీసా కోసం క్లయింట్ల దగ్గర్నుంచి Dh500 వసూలు చేస్తున్నట్లు స్మార్ట్ ట్రావెల్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







