యూఏఈ ఉపాధి చట్టంలో మార్పులు...

- October 10, 2022 , by Maagulf
యూఏఈ ఉపాధి చట్టంలో మార్పులు...

యూఏఈ: ప్రైవేట్ రంగంలో స్థిర-కాల ఉద్యోగ ఒప్పందాల వ్యవధిపై అమల్లో ఉన్న మూడు సంవత్సరాల పరిమితిని యూఏఈ ఎత్తివేసింది. ఈ మేరకు యూఏఈ ఉపాధి చట్టం, ఉపాధి సంబంధాల నియంత్రణ డిక్రీ-చట్టానికి మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) సవరణలను ప్రకటించింది. దీంతో ఫిబ్రవరిలో యూఏఈలో అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలలో మార్పులు చోటు చేసుకుంటాయని ప్రకటించింది. ప్రైవేట్ రంగంలో స్థిర-కాల ఒప్పందాలు ఇప్పటికీ నిర్వచించబడిన వ్యవధిని కలిగి ఉండాలని సవరణలు చేసిన యూఏఈ ఉపాధి చట్టం పేర్కొంది. అయితే యూఏఈ ఉపాధి చట్టం పరిధిలో జరిగిన ఒప్పందాలు ఎంతకాలం అమల్లో ఉండాలనే అంశంపై కాల పరిమితిని మాత్రం పేర్కొనలేదు. రెండు పార్టీలు షరతులకు అంగీకరించినంత వరకు కాంట్రాక్టులను పునరుద్ధరించవచ్చని MoHRE తెలిపింది. కొత్త నియమాలు ఉద్యోగులు, యజమానులకు సరైన మార్గంలో రక్షణను అందించడమే లక్ష్యంగా ఉంటుందని మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ వెల్లడించారు. యూఏఈ ఉపాధి చట్టంలో సవరణలు రాజ్యంలో ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందిస్తూ కార్మిక మార్కెట్ వృద్ధి, స్థిరత్వాన్ని పెంచుతాయని అల్ అవార్ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com