దర్శకుడిగా త్రివిక్రముడికి ఇరవయ్యేళ్లు.!

- October 10, 2022 , by Maagulf
దర్శకుడిగా త్రివిక్రముడికి ఇరవయ్యేళ్లు.!

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి ఇరవయ్యేళ్లు గడిచింది. ఆయన మాటల రచయితగా వున్నప్పుడు, ఆయా సినిమాలకు ఆయన మాటలే ఓ బలం. ఆయన మాటలతోనే ఆయా సినిమాలు సక్సెస్ అయ్యాయంటే అతిశయోక్తి కాదేమో.
అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ శరణ్ జంటగా రూపొందిన ఈ సినిమాలోని త్రివిక్రమ్ మాటలే కాదు, టేకింగ్ కూడా అదరగొట్టేశాడు. అయితే అప్పట్లో ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు.
కానీ, క్లాసిక్ మూవీస్‌లో అప్పటికీ, ఇప్పటికీ ముందు వరుసలో నిలుస్తుంది ‘నువ్వే నువ్వే’ చిత్రం. ఆ తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహేష్ బాబుతో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు తెరకెక్కించాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.
పవర్ ష్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సెన్సేషనల్ హిట్ మూవీ. అలాగే, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో..’, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ‘అరవింద సమేత..’ ఇలా చెప్పుకుంటూ పోతే, త్రివిక్రమ్ ఖాతాలో సూపర్ హిట్లకు కొదవే లేదు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం సంసిద్ధమవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com