తదుపరి సీజే పేరును ప్రతిపాదించిన చీఫ్ జస్టిస్ యూయూ లలిత్
- October 11, 2022
న్యూఢిల్లీ: భారత సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్‌కు న్యాయశాఖ లేఖ రాసింది. రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ నియమం ప్రకారమే ఈరోజను సీజేఐ యూయూ లలిత్.. తదుపరి సీజే పేరును ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందే నేడు సిఫారసు లేఖను ఆయన అందజేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ లాయర్. ఆయన పేరును తదుపరి సీఐగా ప్రతిపాదిస్తూ రాసిన లేఖను జస్టిస్ లలిత్ కేంద్రానికి పంపారు. ఒవకేళ జస్టిస్ లలిత్ చేసిన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే, అప్పుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నవంబర్ 10, 2024లో ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ భారత 16వ సీజేఐగా చేశారు. ఆయన ఫిబ్రవరి 2, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా చేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. తాజాగా మహిళల గర్భస్త్రావంపై వచ్చిన సంచలన తీర్పు ఈయన ఇచ్చిందే. అవివాహిత మహిళలు కూడా 24 వారాల గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆయన తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







