అద్భుత పూల ప్రదర్శనలతో ప్రారంభమైన దుబాయ్ మిరాకిల్ గార్డెన్
- October 11, 2022
దుబాయ్: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ పదకొండవ సీజన్ ప్రారంభమైంది. ప్రపంచంలోని అతిపెద్ద సహజ పూల తోట సందర్శకులు మునుపెన్నడూ చూడని పూల, నీటి నేపథ్య ఆకర్షణలను ఈసారి కొత్తగా ఏర్పాటు చేసినట్లు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సృష్టికర్త, సహ వ్యవస్థాపకుడు ఇంజనీర్ అబ్దెల్ నాజర్ రహల్ వెల్లడించారు. నవంబర్ 20న పోటీ అధికారికంగా ప్రారంభమైనప్పుడు ది స్మర్ఫ్స్లోని దిగ్గజ పాత్రలు ఈ సంవత్సరం FIFA ప్రపంచ కప్లో పాల్గొనే వివిధ దేశాల జెర్సీలను ధరిస్తారని తెలిపారు. ఈ పాత్రలు నాలుగు మీటర్ల ఎత్తులో నిలబడి తోటలోని సుందరమైన పూలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయన్నారు. కొత్తగా 'ఫ్లోరల్ టన్నెల్స్' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ కుటుంబాలు విశ్రాంతి తీసుకోవచ్చని, భోజనాన్ని ఆస్వాదించవచ్చన్నారు. అలాగే ఈ సీజన్లో వినూత్నమైన 3-D నీరు, లైటింగ్ ఇన్స్టాలేషన్లు, సరస్సుల లోపల నీటి మిల్లులు కనిపిస్తాయన్నారు. దుబాయ్ల్యాండ్ నడిబొడ్డున 72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ 120 కంటే ఎక్కువ రకాల 150 మిలియన్ల సహజ పుష్పాలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఉద్యానవనంలో వినోదం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు.. వారాంతపు రోజులలో (శనివారం, ఆదివారం), ప్రభుత్వ సెలవు దినాలలో ఉదయం 9:00 నుండి రాత్రి 11:00 వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ టిక్కెట్ల ధర పెద్దలకు (12 ఏళ్లు పైబడిన వారికి) Dhs75, 12 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dhs60. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దివ్యాంగులు ఉచితంగా సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







