నయన తార ఫ్యాన్స్‌కి టార్గెట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి.!

- October 11, 2022 , by Maagulf
నయన తార ఫ్యాన్స్‌కి టార్గెట్ అయిన సీనియర్ హీరోయిన్ కస్తూరి.!

సీనియర్ హీరోయిన్ కస్తూరికి కాంట్రవర్సీలంటే పాపం భలే ఇష్టంలే. కెలుక్కుని మరీ అప్పుడప్పుడూ కాంట్రవర్సీల్లో దూరుతూ వుంటుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కస్తూరి, ఇప్పుడు సీరియల్స్‌తో బుల్లితెరపై బిజీగా గడుపుతోంది.
అప్పుడప్పుడూ వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో, ఇలా కెలికి మరీ తిట్టించుకుంటుంది. తాజాగా కస్తూరిని నయన తార ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అసలు విషయంలోకి వెళితే, సోషల్ మీడియాలో కస్తూరి చాలా యాక్టివ్. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చట్టబద్ధం కాదు.. అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇప్పుడీ పోస్ట్‌తోనే నయన్ ఫ్యాన్స్‌కి కస్తూరి టార్గెట్ అయ్యింది. అదేంటీ.! ఈ ట్వీట్‌కీ, నయన తారకీ సంబంధమేంటీ.? అంటారా.! రీసెంట్‌గా నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ విధానం ద్వారా కవల పిల్లలకు తల్లితండ్రులు అయిన సంగతి తెలిసిందే. 
తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియ జేశారు నయన్, విఘ్నేష్ దంపతులు. ఈ ట్వీట్ వచ్చిన కొన్ని గంటలకే కస్తూరి ఇలా ట్వీట్ చేయడంతో మరి, నయన్ ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. హాయిగా ఆవిడ పనేదో ఆవిడ చూసుకోకుండా, ఇలాంటి స్టేట్‌మెంట్లు పాస్ చేయడం ఎందుకు.? అంటూ ఇంత సాప్ఠ్‌గా కాదండోయ్. బూతులు తిడుతూ నెటిజన్లు కస్తూరిని ఆడి పోసుకుంటున్నారు. ఇదే మరి, కెలికి మరీ బూతులు తిట్టించుకోవడమంటే.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com