మెగాస్టార్ ఫ్యాన్‌గా మారిపోయిన ఆర్జీవీ.! ఇదెక్కడి వింతరా బాబూ.!
- October 11, 2022
ఛాన్సు దొరికితే చాలు.. మెగా ఫ్యామిలీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. అలాంటిది, సడెన్‌గా తనను తాను మెగాస్టార్‌కి వీరాభిమానిగా అభివర్ణించుకుంటున్నాడు ఆర్జీవి. ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన ఇష్యూ పెద్ద రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై చాలా మంది మెగాస్టార్‌కి మద్దతు పలుకుతూ రెస్పాండ్ అయ్యారు. అఫ్‌కోర్స్.! ఇప్పటికైతే ఈ ఇష్యూ కాస్త చల్లారినట్లే. కానీ, వర్మగారికి ఇప్పుడే తెల్లారినట్లుంది. ‘ఏపాటి వాడికైనా మెగాస్టార్ ఇమేజ్ చూస్తే కన్ను కుట్టడం పరిపాటే..’ అంటూ మొన్న మెగా బ్రదర్ నాగబాబు వేసిన ట్వీట్‌కి ‘సారీ నాగబాబు గారూ.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రశక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో మెగాస్టార్‌ని అవమానించిన వాడు గడ్డిపరకతో సమానం తగ్గేదే లే..’ అంటూ తన ట్వీట్‌తో సమాధానమిచ్చాడు.
అలాగే, ‘గరికపాటీ.. నక్కి నక్కి చిన్న చిన్న ప్రవచనాల్లో దాక్కో..అంతేకానీ, పబ్లిసిటీ కోసం ఫిలిం ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు, నువ్వేంటో నువ్వే తెలుసుకో.. అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు విసిరాడు. అంతటితో ఆగలేదు.. హే.! గూగురపాటీ.! నువ్వు గడ్డి పరక అయితే, మెగాస్టార్ నరసింహ.. మిగిలిని రావును నీ పంచ జేబులో పెట్టుకో..’ అంటూ ఆర్జీవీ వేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్.
ఏంటీ ఆర్జీవీ.! ఇలా మారిపోయాడు. ఈయనకేమైంది.. కొత్తగా. ఇదంతా నిజమేనా.? లేక ఇందులో వ్యంగ్యమేదైనా వుందా.? అసలు ఆర్జీవీ ట్వీట్లను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని గందరగోళంలో పడిపోయారు మెగా అభిమానులు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







