త్వరలో ఫోన్ ద్వారా వీసా దరఖాస్తులు: దుబాయ్

- October 11, 2022 , by Maagulf
త్వరలో ఫోన్ ద్వారా వీసా దరఖాస్తులు: దుబాయ్

దుబాయ్: ఫేషియల్ బయోమెట్రిక్ రికగ్నిషన్ ద్వారా ఇంట్లో నుంచే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమల్లోకి వచ్చాక దుబాయ్ నివాసితులు DGRFA సేవను పొందేందుకు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి ఇంటి నుండి కూడా వీసాలు, రెసిడెన్సీ అనుమతులు, ప్రవేశ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోచ్చన్నారు. Gitex Global 2022లో GDRFAలోని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్ ఫాతిమా సలేమ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అథారిటీ వేగంగా పని చేస్తుందన్నారు. విమానాశ్రయాల్లో ఇప్పటికే ఫేషియల్ బయోమెట్రిక్ సిస్టమ్ విజయవంతంగా అమల్లో ఉందని గుర్తుచేశారు.  జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రస్తుతం వీసా సేవలు, ఎంట్రీ పర్మిట్లు, రెసిడెన్సీ సేవలు, ఇతర సేవలను అందిస్తోంది. విదేశీ కార్మికులు దుబాయ్‌కి తరలి రావడంతో.. ఈ ఏడాది ప్రారంభంలో ఎమిరేట్‌లోని జనాభా మొదటిసారిగా 3.5 మిలియన్ల మార్కును దాటింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com