మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం

- October 11, 2022 , by Maagulf
మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రమాదం సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సీబ్‌లోని విలాయత్‌లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటిలో పొగ, గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను పెట్టుకోవడం, ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం వంటి విషయాల ప్రాముఖ్యతను అధికార యంత్రాంగం సూచించింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలు వ్యాపించకుండా చూడాలని, వృద్ధులకు సహాయం చేయడం , పిల్లలు/వికలాంగులు మంటల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. అత్యవసర నంబర్ (9999) లేదా అథారిటీ యొక్క ఆపరేషన్ సెంటర్ (24343666)కి కాల్ చేయాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com