గోవాలో కుప్పకూలిన మిగ్-29కే యుద్ధ విమానం
- October 12, 2022
న్యూఢిల్లీ: గోవా తీరంలో ఓ మిగ్-29 కే యుద్ధ విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు.కాగా, మిగ్-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి.విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం వలన పైలట్ సురక్షింతంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.
రష్యాలో తయారైన మిగ్-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్ సీటుతో అమర్చబడింది.ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం ఈ ఎజెక్షన్ సీటు ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో రెండు మిగ్-29 కే విమానాలు కూలిపోయాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







