జీతాలివ్వలేదని 13 మంది ప్రవాసులు ఆత్మహత్య యత్నం
- October 12, 2022
కువైట్: కాంట్రాక్టు కంపెనీ తమ ఆర్థిక బకాయిలను తిరస్కరించినందుకు 13 మంది ప్రవాసులు సాల్మియాలోని భవనం పైనుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 13 మంది ప్రవాసులు ఒకే దేశానికి చెందిన వారని, కాంట్రాక్టు కంపెనీ కోసం కమర్షియల్ విజిట్ వీసాపై దేశంలోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని, దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా వారిని నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దీంతోపాటు వీరిని నియమించిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







