నకిలీ మెడికల్ సర్టిఫికేట్ల కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష

- October 13, 2022 , by Maagulf
నకిలీ మెడికల్ సర్టిఫికేట్ల కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష

కువైట్: నకిలీ వైద్య పరీక్షల సర్టిఫికేట్లను జారీ చేసిన కేసులో 8 మంది భారతీయ, ఈజిప్టు ప్రవాసులకు 10 సంవత్సరాల జైలు శిక్షను కువైట్ కోర్టు విధించింది. రక్త పరీక్షల ఫలితాలను తారుమారు చేసి, అర్హత లేని ప్రవాసుల నుండి లంచాలు తీసుకున్నందుకు వీరిని కోర్టు దోషులుగా తేల్చింది. విచారణ సందర్భంగా నిందితులు సమర్పించిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. రెసిడెన్సీ ప్రయోజనాల కోసం అనర్హులకు 'మెడికల్ ఫిట్' సర్టిఫికేట్ ఇవ్వడానికి వైద్య పరీక్షల ఫలితాలను తారుమారు చేసినందుకు ఎనిమిది మంది భారతీయ, ఈజిప్టు ప్రవాసులను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. వైరల్ వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది నివాసితులకు "మెడికల్ ఫిట్" సర్టిఫికేట్‌లను జారీ చేశారని, వాటితో వారు దేశంలో రెసిడెన్సీని పొందేందుకు రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌కు వాటిని సమర్పించారని సాక్ష్యాలతో సహా ప్రాసిక్యూషన్ నిరూపించింది. ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో రెసిడెన్సీ హోదాను పొందిన ఓ ఆసియా జాతీయత నివాసిని అరెస్టు చేసి.. విచారించగా ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, రెసిడెన్సీని పొందటానికి బదులుగా ఒక వ్యక్తికి డబ్బు చెల్లించినట్లు సదరు వ్యక్తి అంగీకరించాడని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని మధ్యవర్తులు, ఉద్యోగులు ఒక్కో వ్యక్తి నుంచి 200 నుండి 350 దినార్ల వరకు వసూలు చేసిన అనర్హులకు ‘మెడికల్ ఫిట్’ సర్టిఫికేట్లను జారీ చేసినట్లు ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలు సమర్పించడంతో కోర్టు 8 మంది నిందితులకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com