దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు

- October 13, 2022 , by Maagulf
దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు

యూఏఈ: తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా ఎమిరేట్‌లోని 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్‌లలో (వాహన సాంకేతిక పరీక్ష) ఒకే పనిగంటలను ప్రవేశపెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పనివేళలు వినియోగదారులకు, వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని అథారిటీ తెలిపింది. కొత్త పని వేళల 2022 అక్టోబర్ 14నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.  తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా RTA సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్‌లలో కొత్త పని వేళలు ఉదయం 7:00 నుండి రాత్రి 10:30 వరకు పొడిగించబడతాయి. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు పని చేస్తుంది. తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటాయని ఆర్టీఏ పేర్కొంది. శనివారం కాకుండా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో వారాంతపు సెలవు ఆదివారం ఉంటుంది. శుక్రవారం పని గంటలు రెండు షిఫ్ట్‌లుగా ఉంటాయి.. 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో ఉదయం షిఫ్టు ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని అథారిటీ వెల్లడించింది. శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే పనిచేస్తుందని, అయితే శుక్రవారం తస్జీల్ హట్టా సెంటర్‌లో పని వేళలు సాయంత్రం 3:00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com