వచ్చే ఏడాది నుంచి సౌదీ 'లో-కాస్ట్' ఎయిర్‌లైన్ ఆపరేషన్స్
- April 19, 2016
సౌదీ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ ఫ్లైయాడీల్ అనే ఎయిర్‌లైన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సర్వీసుల్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్స్‌లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది మధ్యలో ఫ్లైయాడీల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని సౌదీ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ సలేష్ అల్ జస్సర్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. తన మాతృ సంస్థ నుంచి స్వతంత్రంగా ఆ సంస్థ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఆయన చెప్పారు. సౌదీ అరేబియన్ హోల్డింగ్ గ్రూప్ నుంచి, సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ అటానమీ ఫామ్‌లో ప్రత్యేకమైన బిజినెస్ స్ట్రేటజిక్ యూనిట్‌గా సేవలు అందిస్తుంది. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ యావియేషన్ బోర్డ్ ఆఫ్ చైర్మన్ మరియు ప్రెజిడెంట్, సౌదియా చైర్మన్ సులేమాన్ అల్ హమాదాన్ మాట్లాడుతూ, లో-కాస్ట్ ప్రయాణీకులకు ఈ కొత్త ఎయిర్‌లైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తొలి దశలో జిసిసి మరియు సరిహద్దు దేశాలే టార్గెట్‌గా ఫ్లైయాడీల్ విమానాల్ని నడపనుంది. 29 ఎ320 ఎయిర్ క్రాఫ్ట్‌లను ఇందు కోసం రానున్న కొన్ని నెలల్లోనే సంస్థ సమకూర్చుకోనుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







