కౌలాలంపూర్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేషియాతో భారతదేశ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి రక్షణ, భద్రత, విద్యా రంగాల్లో సహకారంతో పాటు బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలే మూల స్తంభంగా నిలిచాయని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.కౌలలంపూర్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత హై కమిషనర్ ఏర్పాటు చేసిన మర్యాద పూర్వక విందు కార్యక్రమంలో వారికి వివిధ రంగాలకు చెందిన మలేషియాలోని భారతీయ ప్రముఖులు స్వాగతం పలికారు. భారత హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి, మానవవనరుల శాఖ మంత్రి ఎం.శర్వణన్, పర్యాటక, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి డా.సంథర జె.పి సహా పలువురు ప్రముఖులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలకు మూలంగా నిలుస్తాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రపంచం భారతదేశాన్ని ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన ఇంజన్ గా చూస్తోందని పేర్కొన్నారు. ఎన్నారైలను భారతదేశ అత్యుత్తమ సాంస్కృతిక రాయబారులుగా అభివర్ణించిన ఆయన, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!