‘ఆదిపురుష్’ ‌పై కామెంట్లు.! తూచ్.! నేను అలా అనలేదంటోన్న మంచు విష్ణు.!

- October 15, 2022 , by Maagulf
‘ఆదిపురుష్’ ‌పై కామెంట్లు.! తూచ్.! నేను అలా అనలేదంటోన్న మంచు విష్ణు.!

ఇటీవల రిలీజైన ప్రబాస్ ‘ఆది పురుష్’ టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. దాదాపు నెగిటివ్ కామెంట్లే వచ్చాయ్ ఈ టీజర్‌పై. ఈ నేపథ్యంలోనే ‘రామాయణం వంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు లైవ్ యాక్షన్ డ్రామా వుండాలి కానీ, యానిమేటెడ్‌లో తీసేస్తారా.. టీజర్ రిలీజ్‌కి ముందే ఆ విషయాన్ని రివీల్ చేయాలి. టీజర్‌తో జనాన్ని మోసం చేస్తారా.?’ అలా చేస్తే ఇలాంటి నెగిటివ్ కామెంట్లే వస్తాయ్ మరి.! అని ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడనే ప్రచారం జరిగింది.
విష్ణు వ్యాఖ్యలపై ప్రబాస్ గుస్సా అయ్యారనీ కూడా ప్రచారం జరిగింది. అయితే, అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదనీ, అదంతా ఉత్త ప్రచారమే.. అంటూ తాజాగా మంచు విష్ణు తనపై వస్తున్న ట్రోల్స్‌కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు.
అంతేకాదు, త్వరలో తన సినిమా రిలీజ్ వున్న నేపథ్యంలో కావాలనే తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ‘ఆదిపురుష్’ సినిమా ప్రతిష్టాత్మక చిత్రమనీ, ప్రబాస్‌కి మంచి విజయం తెచ్చిపెట్టాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. 
ఈ నెల 21న మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు మంచు విష్ణు. ఈ సందర్భంగానే తాజా వ్యాఖ్యలు చేశారు. అన్నట్లు ఈ 2సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఇంపార్టెంట్ రోల్ పోషించగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com