రానా డైరెక్టర్‌తో చైతూ పొలిటికల్ డ్రామా నిజమేనా.?

- October 15, 2022 , by Maagulf
రానా డైరెక్టర్‌తో చైతూ పొలిటికల్ డ్రామా నిజమేనా.?

రానా, సాయి పల్లవి జంటగా ‘విరాట పర్వం’ సినిమా విడుదలకు ముందు ఏ స్థాయిలో సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఒకింత నెగిటివిటీ మూట కట్టుకున్నా, కంటెంట్ పరంగా సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ వేణు ఉడుగుల ఓ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ని సిద్ధం చేశాడట. అందుకోసం హీరోగా నాగ చైతన్యను తీసుకోవాలనుకుంటున్నాడనీ ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. 
ఇటీవలే ‘సీతారామం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని లాభాల్ని దక్కించుకున్న వైజయంతీ మూవీస్, ఇప్పుడు నాగ చైతన్య సినిమాని భారీ బడ్జెట్‌తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ప్రబాస్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు నాగ చైతన్య, తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియమణి ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com