బహ్రెయిన్‌లో సంయుక్త తనిఖీలు ప్రారంభం

- October 17, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో సంయుక్త తనిఖీలు ప్రారంభం

మనామా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు సహకారంతో క్యాపిటల్ గవర్నరేట్‌లో సంయుక్త తనిఖీలను ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడంతోపాటు వారిపై బహిష్కరణ ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని సొసైటీ సభ్యులందరికీ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com