FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022: 13 దేశాలతో ‘వతన్’ డ్రిల్
- October 17, 2022
దోహా: ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి HE షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్-థానీ ఆధ్వర్యంలో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం భద్రతా కమిటీ వచ్చే ఆదివారం నుండి ఐదు రోజులపాటు 'వతన్' పేరిట భద్రతా మాక్ డ్రిల్ ను నిర్వహించనుంది. ఈ సైనిక డ్రిల్ లో సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ఇటలీ, జోర్డాన్, కువైట్, స్పెయిన్, పాలస్తీనా, యూఎస్ఏ, టర్కీ, యూకే సహా 13 దేశాల నుండి 11 మంత్రిత్వ శాఖలు, సైనిక, భద్రతా నిపుణులు పాల్గొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించడం, సైనిక - పౌర సంస్థల మధ్య సమన్వయం, ప్రపంచ కప్ సమయంలో భద్రతను మెరుగుపరచడం 'వతన్' డ్రిల్ లక్ష్యమని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







