బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

- October 18, 2022 , by Maagulf
బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపిక అవుతారని అంత అనుకున్నారు కానీ చివరకు రోజర్ బిన్నీ ఆ ఛాన్స్ దక్కింది. ఈరోజు జరిగిన ‘వార్షిక సర్వసభ్య సమావేశం’ (AGM)లో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో BCCI తరపున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏ పదవికి ఎవరి పేరును ప్రకటించలేదు.

1983 ప్రపంచ కప్ విజయంలో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ..కర్ణాటక లోని బెంగుళూరులో 1955 జూలై 19 న జన్మనిచ్చారు. రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చాడు. 1985లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్ లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.

బిన్నీ అతని సొంత మైదానమైన బెంగుళూరు లోనే 1979లో పాకిస్తాన్ పై తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. ఇమ్రాన్ ఖాన్, సర్ఫ్రరాజ్ నవాజ్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లోని ఐదవ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్ కు సిక్సర్ కొట్టిన సంఘటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 72 వన్డే లకు ప్రాతినిధ్యం వహించిన బిన్నీ 16.12 సగటుతో మొత్తం 629 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. వన్డేలో అతని అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్లో 29.35 సగటుతో 77 వికెట్లు సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 4 వికెట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com