‘డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ హోస్టింగ్ బిడ్ గెలిచిన ఖతార్
- October 18, 2022
దోహా: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్ నిపుణులు హాజరయ్యే ‘డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ (DWP) కాంగ్రెస్’కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు నిర్వాహణకు సంబంధించిన బిడ్‌ను ఖతార్ గెలుచుకుంది. 2023 మార్చి 14 -16 మధ్య జరిగే ఈ ప్రీమియర్ బిజినెస్-టు-బిజినెస్ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచ దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు, 140 మంది లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్ నిపుణులు పాల్గొంటారు. బిడ్ కు సంబంధించిన ఒప్పందంపై ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ HE అక్బర్ అల్ బేకర్, క్యూఎన్ఏ (QNA) ఇంటర్నేషనల్ డైరెక్టర్ అకాష్ జైన్ అక్టోబర్ 17న ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో కలిసి భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఈ అక్బర్ అల్ బేకర్ మాట్లాడుతూ.. వెడ్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌లు పెరుగుతున్నాయని, ప్రత్యేకమైన - విలాసవంతమైన వివాహ అనుభవాన్ని పొందాలనుకునే జంటలకు ఖతార్ ఒక ఆప్షన్ గా మారుతుందని తెలిపారు. ఇంతకుముందు మారిషస్, ఫ్లోరెన్స్, థాయిలాండ్, మెక్సికో, బాలి తదితర ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ (DWP) కాంగ్రెస్ ను నిర్వహించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!