రియల్ ఎస్టేట్ ఫీజులను 50% తగ్గించిన ఒమన్
- October 18, 2022
మస్కట్ : రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంకరేజ్ చేసే లక్ష్యంతో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన లైసెన్సింగ్ ఫీజులను మంత్రివర్గం సవరించిందని హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రి HE డాక్టర్ ఖల్ఫాన్ సెడ్ ముబారక్ అల్ షుయిలీ వెల్లడించారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఆరు సేవలకు రుసుములను 50 శాతం తగ్గించినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఛార్జీ మస్కట్ గవర్నరేట్‌లో RO500 నుండి RO200కి, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు RO300 నుండి RO150కి తగ్గించారు. అదేవిధంగా ఈ కార్డ్ పునరుద్ధరణకు రుసుము మస్కట్‌లో RO200 నుండి RO100కి, ఇతర గవర్నరేట్‌లలో RO100 నుండి RO50కి తగ్గించబడింది. అలాగే రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కార్డ్ రీప్లేస్‌మెంట్ రుసుము మస్కట్‌లో RO100 నుండి RO50కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో RO50 నుండి RO25కి తగ్గించినట్లు అల్ షుయిలీ వెల్లడించారు. వన్-టైమ్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కార్డ్ ఇక నుండి మస్కట్‌లో RO50కి బదులుగా RO25. ఇతర గవర్నరేట్‌లలో RO25కి బదులుగా RO15 ఖర్చవుతుందన్నారు. కాగా ఈ కార్డ్ పునరుద్ధరణకు మస్కట్‌లో RO25కి బదులుగా RO15, మిగిలిన ప్రాంతాల్లో RO15కి బదులుగా RO10 మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. ఇక ఈ కార్డ్ రీప్లేస్‌మెంట్ కోసం మస్కట్‌లో RO25కి బదులుగా RO10, ఇతర గవర్నరేట్‌లకు RO15కి బదులుగా RO10 చెల్లించాలన్నారు. ఒమన్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాటి సేవల పనితీరును పర్యవేక్షించడంతో పాటు, లావాదేవీలలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!