బిగ్ టికెట్ డ్రాలో కేజీ బంగారం గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- October 18, 2022
అబుధాబి: ప్రవాస భారతీయు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జయకుమార్ తిరునావుకరసు అక్టోబర్ నెలలో నిర్వహించిన బిగ్ టికెట్ రెండవ వారపు ఇ-డ్రాలో విజేతగా నిలిచి కిలో 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. అక్టోబర్ 16న డ్రా తేదీకి ఒక రోజు ముందు టిక్కెట్ కొనుగోలు చేసినట్లు జయకుమార్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నానని, 2019 నుండి బిగ్ టిక్కెట్ రాఫిల్ టిక్కెట్‌లను కొనుగోలు చేస్తున్నట్లు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పేర్కొన్నారు. మరోవైపు నవంబర్ 3న 25 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్‌కు సంబంధించిన డ్రా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. బిగ్ టికెట్ అభిమానులు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అక్టోబర్ 31 వరకు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!