ఖతార్‌లో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపో ప్రారంభం
- October 19, 2022
దోహా: 478 బస్సుల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపోగా భావిస్తొన్న లుసైల్ బస్ డిపోను రవాణా మంత్రి హెచ్ఈ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్-సులైతి ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్(MOT) పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్‌లో భాగమైన ఈ డిపో.. లుసైల్ సిటీకి పశ్చిమాన ఉంది. పర్యావరణ మంత్రి HE షేక్ డాక్టర్. ఫలేహ్ బిన్ నాసర్ బిన్ అహ్మద్ బిన్ అలీ అల్ థానీ, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) అధ్యక్షుడు డా. ఇంజి. సాద్ బిన్ అహ్మద్ అల్ ముహన్నది, ఖతార్ రవాణా పరిశ్రమ, డెలివరీ అండ్ లెగసీ కోసం సుప్రీం కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అల్-సులైతి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపో అయిన లుసైల్ బస్ డిపో, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను అందిస్తుందన్నారు. ఈ బస్ డిపో మిడిల్ ఈస్ట్‌లో సౌరశక్తిపై ఆధారపడిన మొదటిదని, దీని వినియోగానికి అవసరమైన 4 మెగావాట్ల శక్తి(ప్రతిరోజు)ని ఉత్పత్తి చేయడానికి 11,000 PV సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ డిపో FIFA టోర్నమెంట్లో లుసైల్ స్టేడియం నుండి అల్లోని అల్ బైట్ స్టేడియం వరకు అభిమానుల రవాణాకు తోడ్పడుతుందన్నారు.
తాజా వార్తలు
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు