సన్నీలియోన్ ‘జిన్నా’ అంచనాలు పెంచుతోంది కానీ.!
- October 19, 2022
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ మంచు విష్ణు కోసం తెలుగు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో సన్నీలియోన్ నటించిన తొలి తెలుగు చిత్రమిది. గతంలో ‘కరెంట్‌తీగ’ సినిమాలో నటించినా, ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.
ఇప్పుడు ‘జిన్నా’ కోసం మరోసారి మంచు ఫ్యామిలీ హీరోతోనే స్ర్కీన్ షేర్ చేసుకోవల్సి వచ్చింది సన్నీలియోన్‌కి. అందుకు కారణం, ‘జిన్నా’ కథ తనకు తెగ నచ్చేయడమే అంటోంది సన్నీలియోన్.
ఇంతవరకూ స్సైసీ క్యారెక్టర్లలోనే తనను చూసిన ప్రేక్షకులకు ‘జిన్నా’తో ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ అవుతుందని చెబుతోంది సన్నీలియోన్. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘జిన్నా’.
సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఈ స్టోరీ లైన్ చెప్పగానే అందుకే ఓకే చేసేశా.. అని సన్నీలియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రేణుక అనే బధిర యువతి పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది ఈ సినిమాలో. ‘జిన్నా’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!