కువైట్ లో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పద మృతి
- October 19, 2022
కువైట్: మహ్బౌలాలో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా మరణించారు. కువైట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సిరియన్ మహిళ తన ఉంటున్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుండి కింద పడి మరణించింది. మరో ఘటనలో ఓ నేపాల్ మహిళ తను ఉంటున్న బిల్డింగ్ లోని ఏడవ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసుల తెలిపారు. కాగా, సిరియన్ మహిళ కిటికీని శుభ్రం చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిందని ఆమె తండ్రి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆత్మహత్య చేసుకున్న నేపాల్ మహిళ.. మరొక మహిళ, ఒక వ్యక్తితో కలిసి గదిని పంచుకుంటోందని, తెలియని కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!