దీపావళి సందర్బంగా NBK 107 టైటిల్ ప్రకటన
- October 19, 2022
హైదరాబాద్: అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా లుక్స్ ఆకట్టుకోగా..తాజాగా సినిమా టైటిల్ ను దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌ను ఒక ఐకానిక్ ప్లేస్‌లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు. దాదాపు రూ.60 కోట్లకు ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని అంటున్నారు. అఖండ సక్సెస్‌తో ఈ సినిమాకు భారీ రేంజ్‌లో బిజినెస్ జరగుతుందట. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.70 కోట్ల వరకు జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే బయ్యర్ల నుండి ఫ్యాన్సీ రేటుతో ఆఫర్స్ వస్తున్నాయని చెపుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ