ఆ తప్పు చేయనంటోన్న పాయల్ రాజ్‌పుత్.!
- October 20, 2022
‘ఆర్ఎక్స్100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ బ్యూటీ అనే ముద్ర వేయించుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాకే ఇంత ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుని పాయల్ రాజ్‌పుత్ పెద్ద సాహసమే చేసిందనుకోవాలి.
అయితేనేం, ఫస్ట్ మూవీకే సెన్సేషనల్ హిట్ కొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. అయితే, ఆ తర్వాత ఆ ముద్రను పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది పాయల్ రాజ్‌పుత్.
వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించాక కానీ, ఆ ఇమేజ్ పోలేదు పాయల్‌కి. తాజాగా ఆమె నటించిన ‘జిన్నా’ సినిమా రిలీజ్‌కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న ‘జిన్నా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకుంది పాయల్. కెరీర్ మొదట్లో కథల ఎంపికలో చాలా తప్పులు చేశాననీ, కొందరు తనను అలా ప్రేరేపించి, స్ర్కిప్టు వినకుండానే సినిమాలు ఓకే చేసేలా తప్పుదోవ పట్టించారని తెలిపింది.
కానీ, ఇప్పుడు ఆ తప్పులు రిపీట్ చేయననీ, కథను పూర్తిగా విని, తనకు సెట్ అవుతుందా.? లేదా.? విశ్లేషించుకుని మరీ ఓకే చేస్తున్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ‘జిన్నా’ అలా ఓకే చేసుకున్న ప్రాజెక్టే అనీ, ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నానని పాయల్ ఆశా భావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







