షార్జాలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభించిన ఆస్టర్
- October 20, 2022
షార్జా: 100 పడకలతో మల్టీ-స్పెషాలిటీ సదుపాయాన్ని ఆస్టర్ డీఎం (Aster DM) హెల్త్‌కేర్ ఆసుపత్రి విభాగం అయిన ఆస్టర్ హాస్పిటల్ షార్జా ఎమిరేట్‌లో ప్రారంభించింది. 200,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వైద్య సదుపాయాన్ని షార్జా ఎమిరేట్ డిప్యూటీ రూలర్, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ప్రపంచ స్థాయి వైద్య టెక్నాలజీలను ఏర్పాటు చేయడంపై హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ హర్షం వ్యక్తం చేశారు. మెటర్నిటీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ వంటి అన్ని విభాగాల్లో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆస్టర్ DM హెల్త్‌కేర్ వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ DM హెల్త్‌కేర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అలీషా మూపెన్ పాల్గొన్నారు. ఆస్టర్‌కి యూఏఈలో షార్జాతోపాటు దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లో ఐదు మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితోపాటు వందకు పైగా క్లినిక్‌లు, రిటైల్ ఫార్మసీ వ్యాపారాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్