ఐజీబీసీ ప్లాటినమ్‌ రేటింగ్‌ అందుకున్న ఎల్‌–టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్లు

- October 20, 2022 , by Maagulf
ఐజీబీసీ ప్లాటినమ్‌ రేటింగ్‌ అందుకున్న ఎల్‌–టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్లు
హైదరాబాద్‌: ప్రపంచంలో అత్యుత్తమ హరిత నగరం హైదరాబాద్‌లో హరిత, స్వచ్ఛ నగర ప్రజా రవాణా వ్యవస్థలలో అగ్రగామి అయిన ఎల్‌–టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఇప్పుడు ఐజీబీసీ గ్రీన్‌ ఎంఆర్‌టీఎస్‌ సర్టిఫికేషన్‌ను అత్యధిక ప్లాటినమ్‌ రేటింగ్‌తో పొందింది. ఈ సర్టిఫికేషన్‌ను ఎలివేటెడ్‌ స్టేషన్స్‌ విభాగంలో మూడు అదనపు మెట్రో  స్టేషన్‌లకు పొందింది.ఈ స్టేషన్‌లలో దుర్గంచెరువు (కారిడార్‌ 3, బ్లూ లైన్‌–నాగోల్‌ టు రాయ్‌దుర్గ్‌),  పంజాగుట్ట మరియు ఎల్‌బీనగర్‌ (కారిడార్‌1, రెడ్‌లైన్‌–ఎల్‌బీనగర్‌ టు మియాపూర్‌) ఉన్నాయి.మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనున్న ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ 2022లో భాగంగా నేడు ఈ సర్టిఫికేషన్‌ అందజేశారు. ఎల్‌ – టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ–సీఈఓ కెవీబీ రెడ్డి ఈ ఐజీబీసీ ప్లాటినమ్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.దీనితో హైదరాబాద్‌ మెట్రో  రైల్‌కు చెందిన 23 మెట్రో స్టేషన్‌లు ఐజీబీసీ ప్లాటినమ్‌ రేటింగ్‌ సర్టిఫైడ్‌ స్టేషన్‌లుగా గుర్తింపు పొందాయి.
 
ఈ గుర్తింపు గురించి ఎల్‌–టీ  మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ ఎండీ–సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా మూడు అదనపు మెట్రో స్టేషన్‌లకు ఐజీబీసీ ప్లాటినమ్‌ రేటింగ్‌ అందుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. మెట్రో స్టేషన్‌లను ఆడిటింగ్‌ చేయడంతో పాటుగా  గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో మా ప్రయత్నాలను గుర్తించడం సంతోషంగా ఉంది.  ఇటీవలనే ప్రపంచ హరిత నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ నగరం పట్ల మా నిబద్ధతను ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com