పాఠశాల విద్యార్థులలో 12% పెరిగిన ఊబకాయం
- October 21, 2022
మస్కట్ : పాఠశాల విద్యార్థులలో ఊబకాయాన్ని అరికట్టడానికి 'ఐడియల్ వెయిట్ ఛాలెంజ్' అనే కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మస్కట్ గవర్నరేట్‌లోని 12 పాఠశాలల్లో 200 మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పైలట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH)లోని పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్, 'ఐడియల్ వెయిట్ ఛాలెంజ్' టెక్నికల్ టీమ్ హెడ్ డాక్టర్ సులైమాన్ అల్ షెరైఖీ తెలియజేశారు. నాలుగేళ్లలో ఈ పథకాన్ని సుల్లానేట్ లోని అన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా సమతుల్య పోషణ, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనం, మానసిక కోణాన్ని మెరుగుపరచడం లాంటి అంశాలపై విద్యార్థులకు వారి పేరెంట్స్ కు అవగాహన కల్పించునున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ఊబకాయం కేసులను నిర్ధారించడం, పాఠశాల విద్యార్థులలో ఊబకాయాన్ని తగ్గించడం, ఊబకాయ సంబంధిత ఆరోగ్య పరిస్థితులు- ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, పాఠశాల విద్యార్థులలో మధుమేహం, రక్తహీనత గుర్తించడానికి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో ఊబకాయం పెరుగుదల అధికంగా ఉందన్నారు. ఇది అబ్బాయిలలో 15 శాతం, బాలికలలో 12 శాతంగా ఉందని చెప్పారు. జన్యు వారసత్వం వలన వచ్చే ఊబకాయాన్ని నియంత్రింయడం కష్టమే అయినా.. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, అతిగా తినడం, ప్రాథమిక పోషకాహార జ్ఞానం లేకపోవడం వంటి కారణంగా వచ్చే ఊబకాయాన్ని మాత్రం నియంత్రివచ్చని డాక్టర్ అల్ షెరైఖీ తెలిపారు. ఊబకాయం అలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు, అసాధారణ రక్త కొవ్వు (డైస్లిపిడెమియా), ఆస్టియో ఆర్థరైటిస్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఫలితాలు నమోదు చేసే మొదటి పది పాఠశాలలకు, అలాగే బరువు తగ్గడంలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు. 2017 నేషనల్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వే ప్రకారం.. ఒమన్‌లోని జనాభాలో 66 శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిపారు. సుల్తానేట్‌లో ఊబకాయం ప్రాబల్యం పురుషులలో 23.2 శాతం, మహిళల్లో 39.3 శాతానికి పెరిగిందని డాక్టర్ అల్ షెరైఖీ వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం