తానూ చేసిన కంమేంట్ల పై క్షమాపణ కోరిన ఆర్ బి ఐ గవర్నర్
- April 20, 2016
భారతదేశం యొక్క వృద్ధి రేటు 'ఒంటి కన్ను రాజు' తో పోల్చిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆర్ బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని ఆయన కోరారు. తాను అలాంటి పోలిక చేసి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావాలను, ముఖ్యంగా అంధులను గాయపర్చినందుకు మన్నించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలా ఉండగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పేందుకు అలా మాట్లాడాననని రాజన్ తెలిపారు. తన వ్యాఖ్యలతో జనాభాలోని ఒక వర్గం(అంధులు) వారిని గాయపర్చినందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆర్ బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ , సహాయమంత్రి జయంత్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అలాంటి పదాలు వాడడం విచారకరమని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ షైనింగ్ స్టార్ లా ఉందంటూ రాజన్ వ్యాఖ్యలను జయంత్ సిన్హా తప్పుబట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







