నవంబర్ 4న లుసైల్ స్టేడియంలో బాలీవుడ్ మ్యూజిక్ ఫెస్టివల్‌

- October 22, 2022 , by Maagulf
నవంబర్ 4న లుసైల్ స్టేడియంలో బాలీవుడ్ మ్యూజిక్ ఫెస్టివల్‌

ఖతార్: 2022 FIFA వరల్డ్ కప్ ఫైనల్ వేదికయిన లుసైల్ స్టేడియంలో నవంబర్ 4న బాలీవుడ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు FIFA తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యూజిక్ ఫెస్ట్ లో రాహత్ ఫతే అలీ ఖాన్, సునిధి చౌహాన్, సలీం సులైమాన్ వంటి బాలీవుడ్ మ్యూజిషియన్లు ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఈవెంట్‌కు ప్రవేశ టిక్కెట్‌లు చెల్లుబాటు అయ్యే హయ్యా కార్డ్‌లతోపాటు ఖతార్ 2022 టిక్కెట్ హోల్డర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.  అక్టోబర్ 21న ప్రారంభమైన టిక్కెట్ విక్రయాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయని, బాలీవుడ్ మ్యూజిక్ ఫెస్టివల్ టిక్కెట్‌లు నాలుగు (1 (QR200), 2 (QR150), 3 (QR80), 4 (QR40)) కేటగిరీలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఒకరు గరిష్టంగా ఆరు (6) టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. వీసా క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లు, మాస్టర్ కార్డ్ క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లు, గృహ చెల్లింపు కార్డ్ (NAPS) ద్వారా చెల్లింపులు చేయవచ్చని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com