Dh542,000 అప్పు చెల్లించలేదని మాజీ బాయ్ ఫ్రెండ్‌పై కోర్టుకెక్కిన మహిళ
- October 22, 2022
యూఏఈ: తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తన నుండి Dh542,000 తీసుకున్నాడని ఆరోపించిన ఒక మహిళ కేసును అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. రిలేషన్ లో ఉన్నప్పుడు సదరు వ్యక్తి ఆర్థిక సమస్యల పేరు చెప్పి తన నుంచి Dh542,000 అప్పుగా తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. అనంతరం అప్పు తిరిగి ఇవ్వాలని అగిగితే.. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన వాదనలకు మద్దతుగా వాట్సాప్, ఇతర సోషల్ మీడియా చాటింగ్, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను కోర్టుకు సమర్పించింది. అయితే, ఆమె సమర్పించిన ఫోన్ సంభాషణల కాపీలు నకిలీవని, బాధిత మహిళ నుండి నగదును అప్పుగా తీసుకున్నట్లు చూపించే ఎలాంటి రుజువు, రసీదును మహిళ సమర్పించలేదని అతని న్యాయవాది కోర్టులో వాదించారు. అన్ని పక్షాల నుండి విన్న తర్వాత అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







