కేసీఆర్ ను ఆహ్వానించిన బాలయ్య
- April 20, 2016
ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ముహుర్తం షాట్ కు బాలయ్య ఈ సందర్భంగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కాగా అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమి టైటిట్ ను ఉగాదిరోజున అమరావతిలో ప్రకటించగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 22న పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను బాలయ్య ఆహ్వానించారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









