ట్రాఫిక్ పర్యవేక్షణకు డ్రోన్ల వినియోగం.. పెరిగిన నిఘా
- October 22, 2022
యూఏఈ: అజ్మాన్ పోలీసుల కోసం ఎయిర్ సపోర్ట్ సెంటర్ ఒక సంవత్సరం నుండి భద్రతను మెరుగుపరచడానికి, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్‌ను పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు 20 భద్రత-నిఘా మిషన్లు, 299 ట్రాఫిక్ మిషన్లు, 13,598 నిమిషాల పాటు డ్రోన్ ఎయిర్ కార్యకలాపాలను నిర్వహించినట్లు ఎయిర్ సపోర్ట్ సెంటర్ కెప్టెన్ రషీద్ అల్ అత్తర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. ట్రాఫిక్ జామ్‌లకు గల కారణాలను తెలుసుకోవడంతోపాటు భద్రతా అధికారులకు డ్రోన్స్ ఆపరేషన్స్ సహాయపడుతుందన్నారు. ప్రమాదాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి డ్రోన్స్ విజువల్స్ ఉపయోగపడతాయని వివరించారు. ఈ డ్రోన్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలు అమర్చబడి ఉంటాయని, అవి 1,000 మీటర్ల దూరంలో ఉన్న చిత్రాలను స్పష్టంగా తీయగలవన్నారు. వాహానాల నంబర్ ప్లేట్‌ను గుర్తించగలవన్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







