మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం .. ట్రక్కు ఢీకొన్న బస్సు ..15 మంది కూలీలు మృతి
- October 22, 2022
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందవి. శనివారం (అక్టోబర్ 22,2022)తెల్లవారుజామున రేవా జిల్లాలోని సుహాగి హిల్స్ సమీపంలో ఓ ట్రక్కును బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది కూలీలులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ గాయపడినవారిలో 20మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు ప్రయాణీకులతో వెలుతున్న బస్సు శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో ముందు వెళుతున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సులో ముందు భాగంలో కూర్చున్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యూపీ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చిన కూలీలు. దీపావళి పండుగకు వీరంతా తమ స్వగ్రామానికి వెళుతుండా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగకని వెళుతు చనిపోవటం కడు విచారకంగా మారింది.
ప్రమాదం జరిగిన తరువాత గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించామని వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రిలో చేర్చామని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలని వెల్లడించారు.దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెలుతున్నారు. ఈక్రమంలో వేగంగా వస్తున్న ఓ బస్సు ముందు ఓ గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆ ట్రక్కు వెనుకనే వస్తున్న బస్సు అదుపు తప్పి ట్రక్కు ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







