సల్లూభాయ్‌కి అనారోగ్యం.! ఖాన్‌కి అసలేమైంది.?
- October 22, 2022
సల్లూ భాయ్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అనారోగ్యం బారిన పడ్డారు. గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్, ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా, డెంగ్యూ అని వైద్యులు నిర్ధారించారు.
బాగా నీరసించిపోయిన సల్లూ భాయ్‌ని రెండు, మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీషూటింగులు వాయిదా పడ్డాయ్.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయ్, కిసీకా జాన్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, ‘బిగ్‌బాస్’ 16 వ సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. షూటింగ్స్ అయితే వాయిదా పడ్డాయ్. కానీ, బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా సల్మాన్ ప్లేస్‌లోకి బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ కాంట్రవర్సీ కా బాప్ అయిన కరణ్ జోహార్ వ్యవహరించనున్నారట.
ఇదిలా వుంటే, ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’లో సల్లూ భాయ్ చేసిన సందడికి తెలుగు సినీ జనం ఫిదా అయిపోయారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







