దుకాణదారుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

- October 22, 2022 , by Maagulf
దుకాణదారుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

బహ్రెయిన్: ఎలాంటి కారణం లేకుండానే దుకాణదారుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. దుకాణదారుడిపై దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన ముహరక్ గవర్నరేట్‌లోని కిరాణా దుకాణం వెలుపల జరిగిందని గుర్తించారు. ముహరఖ్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ మాట్లాడుతూ.. దుకాణంలో పనిచేస్తున్న ఒక ఆసియా జాతీయుడిపై నిందితుడు అకారణంగా దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడిలో బాధితుడు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నివేదిక అందిన వెంటనే విచారణ ప్రారంభించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. దాడికి పాల్పడ్డ వ్యక్తిని అత్యవసర క్రిమినల్ విచారణకు రిఫర్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com