హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేసిన శృతిహాసన్.! జోరు మామూలుగా లేదుగా.!
- October 22, 2022
కమల్ హాసన్ ముద్దుల తనయ, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జోరు మామూలుగా లేదు. సెకండాఫ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ జోరుగా కెరీర్‌లో దూసుకెళ్లిపోతోంది శృతిహాసన్.
ఇప్పటికే టాలీవుడ్‌లో మూడు ప్రెస్జీజియస్ ప్రాజెక్టులు శృతిహాసన్ చేతిలో వున్నాయ్. అందులో రెండు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు. ప్రబాస్‌తో ‘సలార్’ లో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేర్ వీరయ్య’లోనూ శృతిహాసనే హీరోయిన్.
ఇక, నందమూరి నటసింహం బాలయ్యతో ‘వీర సింహారెడ్డి’ సినిమాలోనూ శృతిహాసన్ నటిస్తోంది. వీటితో పాటూ, ఓ ఇంగ్లీష్ మూవీతో హాలీవుడ్‌లోనూ సందడి చేయనుంది.
ఓ రకంగా చెప్పాలంటే, ఇదో హీరోయిన్ సెంట్రిక్ మూవీ అని చెప్పొచ్చు. ‘ది ఐ’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న సైకలాజికల్ థ్రిల్లర్. మార్క్ రౌలీతో కలిసి శృతిహాసన్ స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. డాఫ్నే ష్మీన్ ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రస్తుతం గ్రీస్‌లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







