మంచు ఫ్యామిలీకి మళ్లీ షాకిచ్చిన సన్నీలియోన్

- October 22, 2022 , by Maagulf
మంచు ఫ్యామిలీకి మళ్లీ షాకిచ్చిన సన్నీలియోన్

గతంలో ‘కరెంట్ తీగ’ అనే సినిమా కోసం మంచు మనోజ్ బోలెడంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ సన్నీలియోన్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు. జస్ట్ కొన్నిసీన్లు మరియు ఓ స్పెషల్ సాంగ్ చేయించుకున్నాడు తన సినిమాలో మంచు మనోజ్.
అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ సంగతి ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. తాజాగా మంచు విష్ణు మరోసారి సన్నీలియోన్‌ని తన తాజా సినిమా ‘జిన్నా’ కోసం ఏరి కోరి తెచ్చుకున్నాడు. ఈ సారి కూడా చాలా చాలా గట్టిగానే బాదేసింది రెమ్యునరేషన్ రూపంలో సన్నీలియోన్. 
అయితే, ఈ సారి కొంచెం ఛేంజ్. సినిమా అనుకున్నప్పటి నుంచీ సినిమా ప్రమోషన్ల కోసం తెగ కష్టపడింది సన్నీలియోన్. మంచు విష్ణుతో కలిసి ఏవేవో చిలిపిచేష్టలు చేస్తూ సినిమాని తెగ ప్రమోట్ చేసింది. కానీ, ఏం లాభం. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జిన్నా’ కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ చేసింది. 
‘జిన్నా’తో పాటూ, మరో మూడు సినిమాలు అదే రోజు రిలీజ్ కాగా, అవి ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నాయ్. కానీ, ‘జిన్నా’ని అస్సలు పట్టించుకోలేదు ఆడియన్స్. పాపం సన్నీలియోన్ కష్టం వృధా అయిపాయె. మంచు విష్ణుకి బడ్జెట్‌లో పేద్ద చిల్లు పడిపోయె.! 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com