సముద్రం కింద నుంచి బుల్లెట్ ట్రైన్
- April 20, 2016
బుల్లెట్ రైలు త్వరలో భారతీయ రైల్వేలో అడుగుపెట్టడమే ఒక గొప్ప అనుభూతి అనుకుంటే.. అంతకుమించిన మధురానుభూతి అతిత్వరలో లభించనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడం ద్వారా అది సొంతం కానుంది. ఎందుకంటే అరేబియా తీరం గుండా ఉండే ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచే బుల్లెట్ రైలు సముద్రం కింద నుంచి పరుగులు పెట్టనుందట. దీని కోసం ఓ భారీ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నారు.ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలును ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు ప్రయాణించే మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. అందులో 21 కిలోమీటర్లు సముద్రం క్రింది నుంచి ప్రయాణించనుంది. అందుకు ప్రధాన కారణం ధానే వద్ద ఓ పెద్ద సముద్ర చీలిక అడ్డురావడం.
ఈ నేపథ్యంలోనే ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ఏర్పాటు కోసం మొత్తం రూ.97,636 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇందులో జపాన్ వద్ద నుంచే 81శాతం రుణంగా ఇస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా.. 2018లో పనులు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









