సౌదీలో మొట్టమొదటి ఆంకాలజీ ఇ-ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- October 23, 2022
సౌదీ: ఆంకాలజీ కోసం మధ్యప్రాచ్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆంకాలజీ రోగులకు అందించే ఆరోగ్య నాణ్యతా సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో రియాద్‌లోని వర్చువల్ హెల్త్ హాస్పిటల్ ప్రధాన కార్యాలయంలో ఆంకాలజీ ఇ-ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడిందని పేర్కొంది. అనేక సబ్స్పెషల్టీలలో నైపుణ్యం కలిగిన సౌదీ వైద్యుల బృందం ప్లాట్‌ఫారమ్‌ను పర్యవేక్షిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇ-ప్లాట్‌ఫారమ్ రాజ్యంలో వెలుపల ఉన్న ఆంకాలజీ రంగంలోని నిపుణుల జ్ఞానాన్ని, అనుభవాలను మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తున్న కొందరు వైద్యులు సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ సోకిన అనేక కేసులను అధ్యయనం చేయడం ప్రారంభించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ టెలికాం కంపెనీ (ఎస్టిసి) భాగస్వామ్యంతో ఇ-ప్లాట్‌ఫామ్ సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







