రికార్డు సమయంలో దొంగలను పట్టుకున్న అజ్మాన్ పోలీసులు.. Dh350,000 రికవరీ
- October 23, 2022
యూఏఈ: అజ్మాన్ పోలీసులు Dh350,000 విలువైన గృహ దోపిడీ కేసును రికార్డు సమయంలో ఛేదించి నిందితులను పట్టుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఆసియా కుటుంబానికి చెందిన ఇంట్లో ఖరీదైన నగలు, నగదు, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు అల్ నుయిమియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నుయిమియా ప్రాంతంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకున్నట్లు అజ్మాన్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నుయిమి తెలిపారు. కుటుంబీకులు తిరిగి వచ్చేసరికి ఇంట్లో బట్టలు, ఫర్నీచర్, ఇతర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సి బంగారు ఆభరణాలు, డబ్బు, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసు పెట్రోలింగ్, నేర పరిశోధన బృందాలు, సీఐడీ ఏ బృందాలు నాలుగు నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నాయని, త్వరితగతిన తనిఖీ చేయగా కిటికీలోంచి దుండగులు ఇంట్లోకి ప్రవేశించినట్లు తేలిందన్నారు. దొంగలు సేఫ్ లాకర్ ను తెరిచి 350,000 దిర్హామ్‌ల విలువైన నగలు, నగదు, కొన్ని విలువైన పరికరాలను దొంగిలించారని వివరించారు. రెండు రోజుల్లోనే దొంగలను గుర్తించి అల్ రషీదియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం దొంగలు ఖర్చు చేసిన వాటిని మినహాయించి.. ఆభరణాలు, పరికరాలను కుటుంబానికి తిరిగి ఇచ్చినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం







