‘సహెమ్’ కింద 4,500 మందికి ఉపాధి
- October 23, 2022
మస్కట్ : ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన సాహెమ్ కింద ప్రభుత్వ రంగంలో తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4,500 మంది ఉద్యోగార్ధులను నియమించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) వెల్లడించింది. వివిధ గవర్నరేట్‌లలోని ప్రభుత్వ సంస్థల్లో తాత్కాలిక కాంట్రాక్ట్ వర్క్ సిస్టమ్‌లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి మంత్రిత్వ శాఖ సాహెమ్ ను ప్రారంభించిందని మస్కట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ డైరెక్టర్ డాక్టర్ సైఫ్ మొహమ్మద్ అల్ బుసైది తెలిపారు. ఇందులో భాగంగా 4,500 మందిని నియమించారని ఇటీవల ఒమన్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణ విద్య డిప్లొమా (GED), బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ GED అర్హతల కంటే తక్కువ విద్య ఉన్న ఉద్యోగార్ధులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగార్ధులను కోరారు. లేబర్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మూడవ త్రైమాసికం ముగిసే వరకు 31,354 మంది ఉద్యోగార్ధులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







