కేజీ బంగారం దోచుకెళ్లిన నకిలీ పోలీసుల ముఠా
- October 23, 2022
దుబాయ్: పోలీసు అధికారులమంటూ ఓ ఆసియా వ్యక్తి నుంచి 1 కేజీ బంగారాన్ని దోచుకున్న నలుగురు వ్యక్తుల ముఠాకు దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దొంగిలించబడిన బంగారం విలువ Dh215,000 ను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత ఫిబ్రవరిలో గల్ఫ్ దేశస్థుడితో సహా నలుగురు వ్యక్తుల ముఠా తనను దోచుకున్నట్లు ఒక ఆసియా వ్యక్తి నివేదించాడు. నిందితుల్లో ఒకరి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, నగల వ్యాపారినని పరిచయం చేసుకున్నారని బాధితుడు తెలిపాడు. తన వద్ద ఉన్న బంగారు కడ్డీని కొంటామని, కరామాలోని నగల దుకాణం దగ్గరికి రావాలని కోరారు. దీంతో బాధితుడు తన దగ్గర ఉన్న బంగారు కడ్డీని తీసుకొని నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా.. నిందితుల ముఠా బాధితుడిపై దాడి చేసి బంగారు కడ్డీని అపహరించారు. అనంతరం పోలీసులు ఆశ్రయించగా.. నేరానికి ఉపయోగించిన వాహనం ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







