దీపావళి రోజు భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రిషి సునాక్
- October 25, 2022
లండన్: బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సామాన్యుడిగా వచ్చిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్.. చరిత్ర సృష్టించాడు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలించబోతున్నాడు.
దీపావళి రోజు 130 కోట్ల భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ అందించాడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ విర్రవీగిన తెల్లదొరలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన దీపావళి రోజు భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు.
అన్నీ ఉన్నప్పుడు కాదు అష్టకష్టాల్లో పాలించడం ఎలాగో చూపిస్తానంటున్నాడు.అతడి పై అతడికి మాత్రమే ఉన్న నమ్మకం కాదు, అతడిపై బ్రిటన్ ఎంపీలకు ఉన్న నమ్మకమే రిషి సునక్ ను వన్ అండ్ ఓన్లీగా నిలబెట్టింది. నువ్వు మగాడివిరా బుజ్జి, ఇక ప్రధాని సీటు నీదేనంటూ అప్పగించేలా చేసింది. లిజ్ ట్రస్ రాజీనామాతో ఏర్పడ్డ నాయకత్వ సంక్షోభంలో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రిషి సునక్ వైపే మొగ్గుచూపారు. రేసులో మరో కీలక నేత ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం సునక్ కే జైకొట్టారు. ప్రధాని పదవికి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి సునక్ కు ఏకంగా 193 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తే, పెన్నీ మోర్డాంట్ వైపు నిలబడింది కేవలం 26 మంది మాత్రమే.పైగా అంతకుముందు మోర్డాంట్ కు మద్దతిచ్చిన వాళ్లు సైతం సునకే బెటర్ అంటూ క్యాంప్ మార్చేశారు.2024 ఎన్నికల్లో గెలవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని టోరీ ఎంపీలు నిర్ణయించారు.
లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, బ్రిటన్ ప్రధానిగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తొలుత బోరిస్ జాన్సన్, ఆ తర్వాత పెన్నీ మోర్డాంట్ సైతం పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై బ్రిటన్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.
ఇటీవల లిజ్ ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ ఎంపీలు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు.ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు.దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునక్‌ను వరించింది.నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.
బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా మద్దతును పొందడం ద్వారా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునక్ (42) అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







