వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 25, 2022
వాషింగ్టన్: అమెరికా వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ పాల్గొన్నారు. దీపాలను వెలిగించి బైడెన్ వేడుకలను ప్రారంభించారు. బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా సంస్కృతిలో దీపావళిని చేర్చినందుకు భారత సంతతికి, దేశంలో ఉన్న భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా విందు ఇవ్వడం తనకు గర్వకారణమని బైడెన్ చెప్పారు.
ఈ వేడుకల్లో సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. యూఎస్‌లో ఉన్న భారతీయులకు బైడెన్, కమలాహారిస్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రవాస భారతీయులకు కమలాహారిస్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ వైట్‌హౌస్ ప్రజల ఇల్లు, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి సంప్రదాయ వేడుకను నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కమలాహారిస్ అన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







