ఎన్నారైలకు ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన
- October 25, 2022
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI) తాజాగా కీలక ప్రకటన చేసింది.ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా.. చెక్కు ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించిన పెనాల్టీను కూడా పెంచుతున్నట్టు చెప్పింది. క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ సేట్‌మెంట్, పాస్‌బుక్ సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్‌ల జారీ, తదితర సేవలన్నిటికీ చార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకు రూ.7558 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం అధికం. ఇక బ్యాంకు నికర ఆదాయం 26 శాతం పెరగ్గా, ప్రాఫిట్ మార్జిన్ 4.31 శాతం మేర పెరిగింది. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐకి ప్రస్తుతం 5,614 బ్రాంచ్‌లు ఉన్నాయి. మొత్తం 13,254 ఏటీఎంల నెట్వర్క్ కూడా ఉంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా సందీప్ బక్షీని మరోసారి నియమించినట్టు బ్యాంకు సెబీకి ఇచ్చిన వివరాల్లో తెలిపింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







